వేములవాడ క్రీడోత్సవం: యువతతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: మహేష్
స్థలం: సిద్దిపేట
వేములవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా కబడ్డీ ఆడటం జరిగిందని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ క్రీడా వేడుకల్లో భాగంగా వివిధ పోటీల్లో విజేతగా నిలిచిన క్రీడాకారులకు ఆయన స్వయంగా బహుమతులు ప్రదానం చేశారు. యువత క్రీడల్లో రాణించాలని, శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.