రామన్నపేటలో విద్యార్థులకు పోక్సో చట్టంపై దిశానిర్దేశం చేసిన జడ్జి రత్నకుమారి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి. రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు బాలల హక్కులపై విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్యానెల్ అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.