బాలాఘాట్ గిరిజన ప్రాంతాల్లో పిల్లల మృతిపై సీజేపీ నేత తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో గిరిజన పిల్లల మరణాలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా స్పందించారు. గిరిజన పాఠశాలల దుస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలకు ఆరు నెలలుగా వేతనాలు రాలేదని, గ్రామాల్లో తాగునీరు అధ్వానంగా ఉందని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ఇలాంటి పాఠశాలల్లో చదివిస్తారా అని సూటిగా ప్రశ్నించారు.