కుప్పం ప్రజలతో నాది విడదీయరాని కుటుంబ అనుబంధమని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: హరి
స్థలం: చిత్తూరు
కుప్పం నియోజకవర్గ ప్రజలతో తనది కుటుంబ అనుబంధమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్వర్ణ కుప్పం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నారావారిపల్లె తనకు జన్మనిస్తే కుప్పం రాజకీయ జన్మనిచ్చిందని, 40 ఏళ్లుగా ప్రజలు తనను ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో వసతులు, ప్రతి కుటుంబానికి ఇల్లు కల్పించడమే స్వర్ణ కుప్పం లక్ష్యమని స్పష్టం చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.