గ్రామాల్లో పోలీసుల రాత్రి బసతో పెరిగిన భద్రతా భరోసా

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పోలీసు అధికారులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు సైబర్ నేరాలు, ఆస్తి నేరాలు, కొత్త క్రిమినల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు.