రైలు నుంచి జారిపడి ఏఎస్సై మృతి: బాడంగి మండలంలో తీవ్ర విషాదం

రిపోర్టర్: సతీష్ స్థలం: బాడంగి

విశాఖపట్నం డిఐజి కార్యాలయంలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సాగి సాయిబాబారాజు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం చెందారని రైల్వే పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం బొబ్బిలి నుంచి విశాఖ వెళ్తుండగా బాడంగి మండలం డొంకినవలస గేటు సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు స్పష్టం చేశారు.