హైదరాబాద్‌లో విషాదం కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ ఆత్మహత్య
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో అంబర్‌పేట్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ యువతికి వాట్సాప్ వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలపడంతో ఆ యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.