అర్నబ్ తుఫాన్ ముప్పు: కొండ ప్రాంతాల ప్రజల సురక్షిత తరలింపునకు పోలీసుల చర్యలు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఎన్టీఆర్
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల ముప్పు పొంచివున్న కొండ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు విజయవాడ సిటీ పోలీసులు వెల్లడించారు. భవానీపురం, మచవరం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రమాదకర ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేశామని తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కుటుంబాలను సురక్షిత కేంద్రాలకు చేరవేస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.