చెన్నై పోర్టులో రూ.12 కోట్ల చైనా బాణాసంచా సీజ్ చేసిన డీఆర్ఐ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చెన్నై
చెన్నై పోర్టులో ఎలాంటి అనుమతులు లేకుండా చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న పన్నెండు కోట్ల రూపాయల విలువైన బాణాసంచాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారని డీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి ఈ భారీ స్మగ్లింగ్ గుట్టురట్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు.