గనులశాఖ పర్మిట్లలో జాప్యానికి చెక్‌.. స్వీయ ధ్రువీకరణతో తాత్కాలిక అనుమతులు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

పారిశ్రామిక, ఐటీ ప్రాజెక్టుల ప్రాంతాల్లో రాళ్లు, మట్టి తవ్వకాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణతో తాత్కాలిక పర్మిట్లు జారీచేసే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. గనుల శాఖలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోర్టల్‌ ద్వారా ఆయా సంస్థలే అనుమతులు పొందేలా ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.