విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన ఎంవీ మా నౌక: పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కసరత్తు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

దాదాపు ఆరేళ్ల క్రితం తుపాను వల్ల విశాఖపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్కు చెందిన ఎంవీ మా నౌకను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తుక్కు కింద కొనుగోలు చేసిన ఈ నౌకను ప్రజల సందర్శన కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్జడ్ నిబంధనలు అడ్డంకిగా మారడంతో అనుమతుల ప్రక్రియ ఆలస్యమైంది. త్వరలోనే అటవీ, పర్యావరణశాఖ నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం దసరా నుంచి పర్యాటకులకు అనుమతిచ్చే అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.