భారత పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని ప్రశంసించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తబుక్
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో జరిగిన పెను ప్రమాదాన్ని అడ్డుకుని వందలాది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అసాధారణ సాహసాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ దాడిని తిప్పికొట్టి విమానాన్ని రక్షించారని ఆయన కొనియాడారు. సౌదీ అరేబియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైలట్ ఆరోగ్యం నిలకడగా ఉందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.