రేవంత్ కుటుంబ అవినీతిపై బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద తీవ్ర నిప్పులు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కంపెనీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద తీవ్రంగా ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేవంత్‌ను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని లేదా హైకమాండ్ తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అవినీతి ఆరోపణలపై ఇరవై నాలుగు గంటల్లోగా స్పందించాలని, లేదంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.