అల్లూరి ఏజెన్సీలో మంచు అందాలు: పర్యాటకులతో కళకళలాడుతున్న బంగారుమెట్ట కొండలు
రిపోర్టర్: శివ
స్థలం: పాడేరు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం బంగారుమెట్ట, వనుగుపల్లి కొండల్లో మంచు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో దట్టమైన పొగ మంచు కమ్మేసింది. పచ్చని కొండల నడుమ మంచు దుప్పటి పర్చినట్లుగా ఉన్న ఈ ప్రకృతి శోభను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.