నా టెట్ సర్టిఫికెట్ పంపిస్తా చూడమంటూ జగన్‌పై అభ్యర్థుల ఫైర్
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
వైసీపీ అధినేత జగన్‌పై ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దుష్ప్రచారం చేస్తూ పరువు తీసే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీశారు. తమ టెట్ సర్టిఫికెట్లు వాట్సాప్ చేస్తామని, నంబర్ చెప్పాలని సవాల్ విసిరారు. తల్లిని, చెల్లిని గెంటేసిన ఆయనకు తల్లిదండ్రుల బాధలు ఏం తెలుసని మండిపడ్డారు.