గుజరాత్‌లో ఐదేళ్ల కుమార్తెను చంపి ఫ్రిజ్‌లో పెట్టి తండ్రి ఆత్మహత్య

రిపోర్టర్: నరేష్ స్థలం: గుజరాత్

గుజరాత్ రాష్ట్రం అమ్రేలి జిల్లా సావర్కుండ్ల తాలూకా హడిదా గ్రామంలో ఆర్థిక సంక్షోభం కారణంగా కిషోర్ ధనక్ అనే వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తె హిమాన్షిని ఉక్కిరిబిక్కిరి చేసి హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మాణ రంగంలో పెట్టిన పెట్టుబడులు రాకపోవడం, అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు సూసైడ్ నోట్ల ద్వారా వెల్లడైంది.