ఢిల్లీలో ఉద్రిక్తత: సిక్ కు అల్లర్లపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, 1984 సిక్ కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ఇండీ కూటమి నిరసన సభకు ప్రతిగా పశ్చిమ ఢిల్లీ హరినగర్ లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు.