వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు: సామాన్యులకు ఊరటనిచ్చిన చమురు సంస్థలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పందొమ్మిది కిలోల బరువుండే కమర్షియల్ సిలిండర్ పై రూ.10 నుండి రూ.17 వరకు పెంచుతున్నట్లు చమురు సంస్థల అధికారులు స్పష్టం చేశారు. అయితే, సామాన్య గృహ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ లో ఎలాంటి మార్పు చేయలేదని వెల్లడించారు. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లపై అదనపు భారం పడుతుందని తెలిపారు.