తీవ్ర తుఫాను ముప్పు: అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: నరేష్
స్థలం: Amaravati
తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో ప్రజలు ఎవరూ రోడ్లపైకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెల్లవారుజామున టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వివరించినట్లు సీఎం తెలిపారు.