పాలకొండలో మందకొడిగా పోలింగ్ లుంబూరులో ఉద్రిక్తతను అణచివేసిన పోలీసులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గురువారం ఉదయం 11 గంటల సమయానికి కేవలం 28 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 37,465 ఓట్లకు గాను 10,528 ఓట్లు నమోదయ్యాయి. లుంబూరులో కొందరు వ్యక్తులు హంగామా చేయగా పోలీసులు వారిని చెదరగొట్టారు. తహశీల్దార్ రాధాకృష్ణ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళిని క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు.