'అనారోగ్యంతో జిన్పింగ్ అపస్మారక స్థితి..!': బ్రిక్స్ సమ్మిట్లో సంచలనం
రిపోర్టర్: సునీల్
స్థలం: భారత్
భారత్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 2026 వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయారంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. సమ్మిట్ జరుగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ప్రత్యేక విమానంలో చైనాకు తరలించి మిలిటరీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు చైనా డెమోక్రటిక్ పార్టీ చీఫ్ వాంజున్ షీ తెలిపారు. ఈ సంచలన వార్తలపై చైనా అధికారిక వర్గాలు గానీ, భారత ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.