రైతన్నలకు బాసటగా నిలవాలి: అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రైతులను ఆదుకునేందుకు అధికారులు ప్రణాళికాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో పంటలు వేయలేక రైతులు ఇబ్బంది పడుతుంటే, కోస్తాలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. భిన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సహాయ చర్యలు ముమ్మరం చేయాలని, అర్నబ్ తుపాను సమయంలో యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.