అద్భుత జ్ఞాపకశక్తితో అరుదైన రికార్డు: ఇండియా బుక్ లో చిన్నారి మోక్షజ్ణ
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
అద్భుతమైన జ్ఞాపకశక్తితో నెల్లూరు జిల్లాకు చెందిన రెండేళ్ల చిన్నారి మోక్షజ్ణ ధ్రువ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ కు చెందిన ముత్యాల హేమచంద్రబాబు, పద్మప్రియ దంపతుల కుమారుడైన మోక్షజ్ణ, పట్టుమని 28 నెలలు నిండకముందే జంతువులు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, ఖండాల పేర్లను స్పష్టంగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ చిన్నారి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు అతనికి సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేశారు.