నగరిలో ఘనంగా మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహణ

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ పాల్గొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.