రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల పట్టణాభివృద్ధి పనుల ప్రారంభం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కుప్పం
రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో చేపట్టే అభివృద్ధి పనులను కుప్పం నుంచి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల్లో రూ.11,359 కోట్ల భారీ వ్యయంతో వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.