బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది.