విశాఖ తీరానికి తీవ్ర తుపాను ముప్పు: అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

రిపోర్టర్: గోపి స్థలం: Amaravati

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారనున్న నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సముద్రంలో ఉన్న బోట్లు తక్షణమే తీరానికి చేరేలా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.