ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర హోంమంత్రికి మాధవ్ విజ్ఞప్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన ఆర్నబ్, మురాసు తుపాన్ల కారణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు శనివారం లేఖ రాశారు. వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వాకల్చర్ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ, నష్టాన్ని పరిశీలించేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు.