గణనాథుని కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలన్న ఎంపీ డీకే అరుణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: షాద్‌నగర్

షాద్నగర్ పట్టణంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంతారా వారాహి మాత గణేష్ మండపాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నిర్వాహకులను అభినందించి, సంస్థ భవిష్యత్తులో చేపట్టే సేవా కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.