సైబర్ మోసాల గుట్టురట్టు: మూడు టెలిమార్కెటింగ్ కంపెనీలపై కేసు నమోదు
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
ఆర్థిక సేవల సంస్థల పేర్లతో నకిలీ వాణిజ్య ఎస్ఎంఎస్లను పంపిస్తున్న మూడు టెలిమార్కెటింగ్ కంపెనీలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వాల్యూఫస్ట్ డిజిటల్ మీడియా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒనెక్టెల్ లిమిటెడ్, నింబస్ అడ్కామ్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీఎల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఈ చర్యలు తీసుకున్నారు. రిజిస్టర్డ్ హెడర్లు, టెంప్లేట్లను దుర్వినియోగం చేస్తూ వినియోగదారులకు హానికరమైన మోసపూరిత లింకులతో సందేశాలు పంపుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.