వోక్స్వ్యాగన్ ఉద్యోగులకు షాక్: 2030 వరకు జీతాల పెంపు నిలిపివేత
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైందని గ్లోబల్ వర్క్స్ కౌన్సిల్ వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగుల జీతాలను 2030 వరకు పెంచకుండా నిలిపివేయాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ యాజమాన్యం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.