యువతను ఆకట్టుకునేలా దొంగ నా కొడుకు సినిమా నుంచి ఓ మై గాడ్ సాంగ్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం దొంగ నా కొడుకు సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఓ మై గాడ్ పాటను మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. రామ్ మిరియాల ఆలపించిన ఈ జోష్ ఫుల్ రొమాంటిక్ పాటకు సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించగా భాస్కరభట్ల అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారని తెలిపారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ పదమూడున థియేటర్లలో విడుదల కానుంది.