ఆన్‌లైన్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేస్తే పేడ పార్శిల్!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఉత్తర ప్రదేశ్
గ్రేటర్ నోయిడాలో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. ఆకాశ్ నగర్ అనే వ్యక్తి రూ.1,999 చెల్లించి ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేయగా, బట్వాడా చేసిన పార్శిల్‌లో ఎలక్ట్రానిక్ పరికరానికి బదులుగా ఆవు పేడ వచ్చింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.