వైద్య విద్యార్థులకు ఊరట: హోమియో సీట్ల భర్తీకి అర్హత శాతాలు తగ్గించాలని డిమాండ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
మహారాష్ట్రలో హోమియోపతి వైద్య సీట్లు భారీగా ఖాళీగా ఉండటంతో అర్హత శాతాలను తగ్గించాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ కోరిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ధర్మేంద్ర శర్మ తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్నప్పటికీ కటాఫ్ మార్కుల వల్ల ప్రవేశాలు పొందలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ మార్గదర్శకాలను సడలించాలని మరియు దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.