ఎల్ కాంగో ప్రభావంతోనే కరెంటు కోతలపై కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
తెలంగాణలో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఎల్ నినో ప్రభావం కాదని, కాంగ్రెస్ అనే భూతం తెచ్చిన ఎల్ కాంగో ప్రభావం అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.