కుప్పంలో హంద్రీనీవా జలాలకు జలహారతి పట్టిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: నరేష్
స్థలం: Kuppam
కుప్పం నియోజకవర్గం గుండిశెట్టిపల్లెలో హంద్రీనీవా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చి కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది.