బెల్లంపల్లి ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపిన దుర్గం చిన్నయ్య

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని ప్రజలకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ప్రజలందరూ సుఖసంతోషాలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. దుర్గామాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, విజయాలు వెల్లివిరియాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకాంక్షించారు.