ది ప్యారడైజ్ రివ్యూల వివాదంపై స్పందించిన నాని

రిపోర్టర్: రమేష్ స్థలం: ముంబై

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, రివ్యూల బ్యాన్ వివాదంపై ముంబై ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని స్పందించారు. బెంగళూరు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేవలం ఏఐ ద్వారా సృష్టిస్తున్న ఫేక్ పోస్టులను కట్టడి చేయడానికి మాత్రమేనని, నిజమైన ప్రేక్షకుల రివ్యూలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడానికే నిర్మాతలు కోర్టును ఆశ్రయించారని నాని తెలిపారు.