ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీయే కూటమిదే ఘనవిజయం: చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

అమరావతి వేదికగా జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్డీయే కూటమిదే ఘనవిజయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత ఎంతో ముఖ్యమని, అంతర్గత వివాదాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, నీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా 28 జిల్లాలకు నూతన ఇంచార్జ్‌లను నియమించి బాధ్యతలు అప్పగించారు.