మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: ఎమ్మెల్యే కసిరెడ్డి
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, రసాయన రంగుల వల్ల చెరువులు కలుషితమవుతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ, భక్తితో పాటు బాధ్యతగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించి ప్రకృతిని కాపాడుకుందామని ఆయన సూచించారు.