గోపరాజుపల్లిలో అంగన్వాడి కేంద్రంలో ఘనంగా సామూహిక అన్నప్రాసన

రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY స్థలం: వలిగొండ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సలిగంజి పృథ్వి ఆధ్వర్యంలో పిల్లలకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవనీత, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.