గుల్మార్గ్లో అఫర్వాత్ పర్వత శిఖరాన్ని ముంచెత్తిన తొలి సీజన్ హిమపాతం
రిపోర్టర్: రాము
స్థలం: Gulmarg
జమ్మూకశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్ అఫర్వాత్ పీక్పై అకస్మాత్తుగా కురిసిన తొలి హిమపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోందని స్థానిక పర్యాటక అధికారులు తెలిపారు. తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న పర్వత శ్రేణుల మధ్య పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారని వారు వెల్లడించారు. కాలానికంటే ముందే వచ్చిన ఈ మంచు వర్షం టూరిజం రంగానికి ఊతమిస్తోందని, వింటర్ సీజన్ బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.