తిరుమలలో వైభవంగా మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి దర్శనం
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులను అనుగ్రహించారు. గజరాజులు, భక్తబృందాల భజనలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ నేత్రపర్వంగా సాగింది. ఈ వాహనసేవలో తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.