గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ వర్తింపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 11వ పీఆర్సీ నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులకు ఈ ప్రయోజనం అందనుందని స్వర్ణ వార్డు, గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ తెలిపారు.