భారీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురయ్యారన్న మిచెల్ శాంట్నర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆక్లాండ్
అంతర్జాతీయ క్రికెట్ లో విపరీతమైన షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు తీవ్ర అలసటకు గురవుతున్నారని న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్లాండ్ వేదికగా భారత్ తో జరిగే వన్డే సిరీస్ కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిరంతరం జరిగే ప్రయాణాలు, మ్యాచ్ ల వల్ల ఆటగాళ్లపై తీవ్రమైన శారీరక భారం పడుతోందని, రికవరీకి తగినంత సమయం దొరకడం లేదని ఆయన స్పష్టం చేశారు.