హారర్ థ్రిల్లర్గా ఫోర్ వన్ ఎయిట్: సినిమా విడుదల తేదీ ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ఫోర్ వన్ ఎయిట్ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ ఇరవై మూడో తేదీన ఐదు భాషల్లో గ్రాండ్గా విడుదల కానుందని నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ వెల్లడించారు.