టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్న నిగర్ సుల్తానా
రిపోర్టర్: సునీల్
స్థలం: World
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీకి నిగర్ సుల్తానా వీడ్కోలు పలకనున్నారు. 2026 ఆసియా క్రీదల తర్వాత ఆమె ఈ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలిపారు. అయితే ఆమె వన్డే జట్టు కెప్టెన్గా కొనసాగుతూ, టీ20లలో పూర్తిగా బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.