ఫ్లైదుబాయ్ ఘటన కలకలం: యూఏఈ పోలీసుల అదుపులో మాల్దీవుల పైలట్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: దుబాయ్
ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థకు చెందిన ఘటనలో మాల్దీవుల దేశానికి చెందిన ఇద్దరు పైలట్లను యూఏ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల అక్టోబర్ మూడవ తేదీనే వారిని తమ కస్టడీలోకి తీసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. కెప్టెన్ పై దాడికి పాల్పడిన ఒమన్ పైలట్తో వారికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై యూఏఈ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.