ఎన్నికల సంఘం కీలక నిర్ణయం: పదిహేడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పదిహేడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక సమ్మరీ రివిజన్ చేపట్టాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు. యువతకు ఓటు హక్కు కల్పించడం మరియు తప్పులను సవరించడమే ఈ ప్రత్యేక ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు కోల్పోయిన వారికి న్యాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు.