సన్నాయి కళాకారులను ఘనంగా సత్కరించిన స్వర్ణ నంది శివశంకర్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
సన్నాయి వాయిద్యం మంగళకరమైనదని, సంప్రదాయ కళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని స్వర్ణ నంది అవార్డు గ్రహీత మాచర్ల శివశంకర్ అన్నారు. ఖమ్మం అర్బన్ ప్రాంతంలో సన్నాయి వాయిద్య కళాకారులను ఘనంగా సన్మానించి శాలువాలతో గౌరవించారు. ఈ సందర్భంగా కళాకారుల సేవలను అభినందించారు. తరతరాలుగా కొనసాగుతున్న సన్నాయి కళను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కళాకారులను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవచ్చన్నారు.